Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, October 4, 2013

న్యాయాధిపతులు 12

Jdg 12:1  ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా 
Jdg 12:2  యెఫ్తానాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగిన ప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి 
Jdg 12:3  నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. 
Jdg 12:4  అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి. 
Jdg 12:5  ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడోనన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారునీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి. 
Jdg 12:6  అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి. 
Jdg 12:7  యెఫ్తా ఆరు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను. 
Jdg 12:8  అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను. 
Jdg 12:9  అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను. 
Jdg 12:10  ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను. 
Jdg 12:11  అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. 
Jdg 12:12  జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను. 
Jdg 12:13  అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను. 
Jdg 12:14  అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. 
Jdg 12:15  పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీ యుల మన్యము లోనున్న పిరాతోనులో పాతిపెట్ట బడెను. 

No comments:

Post a Comment